సబ్ జైలు వద్ద ఉద్రిక్తత, కేతిరెడ్డి వాహనం అడ్డగించిన టిడిపి కార్యకర్తలు
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రిమాండ్ లో ఉన్న వైసిపి కార్యకర్తలను పరామర్శించేందుకు ధర్మవరం సబ్ జైలుకి వెళ్లారు. ఆయనకు అనుకూలంగా కొందరు వైసిపి కార్యకర్తలు జైలు వద్దకు చేరుకున్నారు. కేతిరెడ్డి జైలు వద్దకు రాగానే జనసేన, టిడిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. వాదనలు తీవ్రమవుతూ ఇరు వర్గాల మధ్య తోపుసులాట చోటుచేసుకుంది. టిడిపి కార్యకర్తలు కేతిరెడ్డి వాహనాన్ని అడ్డగించారు. వాహనం ముందుకు సాగకుండా ప్రయత్నించడంతో జైలు వద్ద పరిసర ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది….
