అనంతపురంలో సబ్ జైలుకు ఆకస్మిక తనిఖీ
అనంతపురం జిల్లా గూటీలోని సబ్ జైలుకు హైకోర్టు ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీ జరిగింది. ఈ తనిఖీ సెక్రటరీ శ్రీ జి శివప్రసాద్ యాదవ్, సీనియర్ సివిల్ జడ్జి సీఎం కాశీ విశ్వనాథ చారి ఆధ్వర్యంలో జరిగింది. తనిఖీ సమయంలో జైలులోని స్వచ్ఛతా పరిస్థితులు మరియు ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఆ క్రమంలో జైలులో స్వచ్ఛత సేవా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా, జైలు వాతావరణాన్ని మరింత అందంగా మార్చడానికి మొక్కలు నాటారు….
