పార్వతీపురం వద్ద ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి జయపుర వైపు వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో ఆందోళన చెలరేగింది. ఉదయం 7.45 గంటల సమయంలో ఆంధ్రా–ఒడిశా ఘాట్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. బస్సులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. ఇంజిన్ నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని ఆపి ప్రయాణికులను దిగిపోవాలని సూచించారు. కొద్ది సేపట్లో మంటలు చెలరేగినా, అందరూ…
