
బంగాళాఖాతంలో అల్పపీడనం: తమిళనాడు, దక్షిణ ఏపీకి రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ అల్పపీడనం రాబోయే 24 గంటల్లో మరింత బలపడి తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫలితంగా తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కడలూరు జిల్లాలో కుండపోత వాన కారణంగా ఓ ఇల్లు కూలిపోయి ఇద్దరు మహిళలు దుర్మరణం పాలయ్యారు. వాతావరణ శాఖ చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, మైలాడుతురై జిల్లాలకు…