
డిసెంబర్ 5న ‘అఖండ 2: తాండవం’ విడుదల
నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2: తాండవం’ విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. గురువారం చిత్రబృందం కొత్త పోస్టర్‌తో ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో కొనసాగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన టీజర్…