లడ్డూ కల్తీపై ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ప్రతిపాదనలు
కర్నూలు జిల్లాలోని ఆదోని డివిజన్ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి, తిరుమల లడ్డూ ప్రసాదంపై కల్తీ అంశంపై సీరియస్గా స్పందించారు. గత జగన్ ప్రభుత్వంపై మండిపడుతూ, ఇది ప్రజలకు సంబంధించి అత్యంత అన్యాయంగా ఉందని అభిప్రాయపడ్డారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం అంగీకరించరాదని ఆయన అన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కల్తీ చేయడం వల్ల భక్తుల మనోభావాలను కించపరచడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. అందుకు మద్దతుగా, ఆయన ఆదోని…
