ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన
జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండల కేంద్రం శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ పాఠశాలలో నేడు ఉదయ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ వీర గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవం జరుపుకుంటామన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం అంటే హృదయాన్ని రక్షించుకునే అంశంపై అవగాహన కల్పించడం కోసం జరుపుకోవాలని ఆయన తెలిపారు. గుండె ఆరోగ్యానికి మంచి జీవనశైలిని ప్రోత్సహించడమే ఈ దినోత్సవ ఉద్దేశం అని…
