వినాయక మండపంలో నాగుపాము ప్రత్యక్షం, భక్తుల ఆసక్తి
అల్లూరిజిల్లా హుకుంపేట మండలం తాడిపుట్టు గ్రామంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో అద్భుతం చోటు చేసుకుంది. గ్రామస్తులు గణేష్ మండపాన్ని ఏర్పాటు చేయగా పాలవెల్లిలో ఓ నాగుపాము ప్రత్యక్షమై చాలాసేపు అక్కడే ఉంది. ఈ మండపంలో జరిగిన ఘటనతో భక్తులు ఆశ్చర్యపోయారు ఇది కచ్చితంగా దైవ సంకల్పం అంటున్నారు స్థానికులు ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు
