కాఫీ, టీ లతో గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందా?
కాఫీ లేదా టీ తాగేవారికి శుభవార్త. రోజుకు మూడు కప్పుల కాఫీ లేదా టీ తాగే వారు గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని సగానికి తగ్గించుకుంటున్నారు. చైనా సైంటిస్టుల అధ్యయన ప్రకారం, కాఫీ, టీలు తీసుకోవడం వల్ల హృద్రోగాలను దూరం పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఉండే కెఫైన్, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఇస్తోంది. సుషౌ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన పరిశీలనలో, రోజుకు మూడు కప్పుల కాఫీ తాగితే 200 నుంచి 300 మిల్లీగ్రాముల కెఫైన్ శరీరంలోకి…
