కెంగువ గ్రామంలో సంక్షేమ ప్రచారంలో మంత్రి శ్రీనివాస్
విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని కెంగువ గ్రామంలో శుక్రవారం “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. 100 రోజుల్లో చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి గ్రామంలో ఇంటింటికీ స్టిక్కర్లు అతికించి, సంక్షేమం, అభివృద్ధి కరపత్రాలను పంపిణీ చేశారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రం మరియు ప్రభుత్వ పాఠశాలలను మంత్రి పరిశీలించి, వాటి పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాఠశాల నిర్వహణ మరియు విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి…
