ఆదోని మండలంలో రోడ్డు దుస్థితి పై రైతుల ఆందోళన
ఆదోని మండలం పెద్ద తుంబలం పరిధిలో బళ్ళారి-రాయచూర్ హైవే రోడ్డు గుంతలుగా మారింది. వినాయక స్వామి ఆలయం దగ్గర PtoP కేబుల్ వర్క్ కోసం తవ్విన తర్వాత మట్టి లూజ్ అయి, వర్షంతో రోడ్డు పూర్తిగా బురదగా మారింది. రైతులు తమ పంటను ఆదోని మార్కెట్‌కు తరలించేందుకు ఈ దారిని ఉపయోగించాల్సి వస్తుంది. అయితే, గుంతలున్న రోడ్డు వల్ల ట్రాఫిక్ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. వాహనదారులు, రైతులు ఆర్ అండ్ బి అధికారులపై నిరసన వ్యక్తం చేస్తున్నారు….
