
బండి సంజయ్ వార్నింగ్… “అధికార అభ్యర్థికి వ్యతిరేకంగా పని చేయడం కన్నతల్లికి ద్రోహం!”
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీ అంతర్గత వాతావరణం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్టీ కార్యకర్తలకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. పార్టీ ప్రకటించిన అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేయడం అత్యంత నీచమైన చర్య అని, అది “కన్నతల్లికి ద్రోహం చేసినట్టే” అని ఆయన వ్యాఖ్యానించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని బూత్ స్థాయి అధ్యక్షులు, మండల నాయకులతో జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో సంజయ్ తన అసహనాన్ని బహిరంగంగా…