
కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సైబర్ మోసానికి బలి: రూ.23.16 లక్షలు తస్కరించిన ఘటన
సైబర్ నేరగాళ్లు ఇప్పుడు సామాన్య ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులను కూడా లక్ష్యంగా చేసుకోవడం తరచుగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కూడా ఇటీవల సైబర్ మోసానికి బలి అయ్యారు. ఈ ఘటనలో ఆయన ఖాతా నుంచి ఏకంగా రూ. 23,16,009 ను సైబర్ నేరగాళ్లు దొంగిలించారు. వివరాల్లోకి వెళితే, గత నెల 22న, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వ్యక్తిగత వాట్సాప్ నెంబర్ కు “ఆర్టీఏ బకాయిలు చెల్లించాలి” అనే లింక్ వచ్చింది….