‘మిథాయ్’ తుపాను రేపు కాకినాడ తీరానికి..! ప్రభుత్వం అప్రమత్తం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వేగంగా బలపడి ‘మిథాయ్’ తుపానుగా మారింది. ఇది రేపు మంగళవారం ఉదయం తీవ్ర తుపానుగా మారి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ తుపాను విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 710 కి.మీ, కాకినాడకు ఆగ్నేయంగా 680…
