
గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం – మూడు బోగీలు దగ్ధం, పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది
పంజాబ్ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన ఒక భయానక ఘటనలో గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే సిబ్బంది అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. అమృత్సర్ నుంచి సహర్సా వెళ్తున్న గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ (Train No.12204) రైలు సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రాంతంలోకి చేరుకునే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు అంబాలా నుంచి సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు ఒక బోగీ నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు…