
‘కాంతార: చాప్టర్ 1’ బాక్సాఫీస్ దుమారం – 9 రోజుల్లో రూ.509 కోట్ల వసూళ్లు
కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాడు. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో రికార్డులు తిరగరాస్తోంది. ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం విడుదలైన తొలిరోజు నుంచే ప్రేక్షకుల నుండి అప్రతిహతమైన స్పందనను పొందుతూ దుమ్మురేపుతోంది. తాజాగా విడుదలైన అప్‌డేట్ ప్రకారం, ‘కాంతార: చాప్టర్ 1’ కేవలం 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 509 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది….