మొంథా తుపాను ఉధృతి – 110 కి.మీ వేగంతో గాలులు, ఏపీలో పోర్టులకు అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను ఉధృతంగా మారుతోంది. ఈ తుపాను ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం సముద్రం తీవ్ర ఆందోళనలో ఉంది. భారీ అలలు తీరప్రాంతాలను ఢీకొడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది….
