
బరేలీలో హింసాత్మక నిరసనలు – తౌకీర్ రజా అదుపులో, 1700 మందిపై కేసులు నమోదు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ పట్టణం నిన్న తీవ్ర ఉద్రిక్తతలకు వేదికైంది. ప్రార్థనల అనంతరం జరిగిన భారీ నిరసన ప్రదర్శన కాసేపట్లోనే హింసాత్మకంగా మారి, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ ఘటనలో 10 మంది పోలీసు సిబ్బందికి గాయాలైనట్లు అధికారులు ధృవీకరించారు. సమాచారం ప్రకారం, స్థానిక మత గురువు, ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ (IMC) చీఫ్ తౌకీర్ రజా చేసిన వీడియో పిలుపుతో “ఐ లవ్ మహమ్మద్” ప్రచారానికి మద్దతుగా భారీ ర్యాలీ…