
సవీంద్ర రెడ్డి అరెస్టు కేసు సీబీఐకి, హైకోర్టు కీలక ఆదేశం – జగన్ హర్షం వ్యక్తం
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణాన్ని కుదిపేస్తున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త సవీంద్ర రెడ్డి అరెస్టు కేసులో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగిస్తూ, పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది. ఈ తీర్పుపై వైసీపీ అధినేత జగన్ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. “ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ ఆదేశం ప్రస్తుత ప్రభుత్వంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు నిదర్శనం” అని ఆయన పేర్కొన్నారు. ‘సత్యమేవ జయతే’…