
బెంగళూరు బిజినెస్ కారిడార్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
బెంగళూరు నగరాన్ని ఊపిరాడనివ్వని ట్రాఫిక్ నుంచి విముక్తి కల్పించేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు దశాబ్దాలుగా వాయిదా పడుతున్న పెరిఫెరల్ రింగ్ రోడ్ (PRR) ప్రాజెక్టును ‘బెంగళూరు బిజినెస్ కారిడార్’గా పునర్నామకరణ చేస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఈ కారిడార్‌ను 117 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు రూ.10,000 కోట్ల అంచనా వ్యయంతో రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు నగరంలోని ట్రాఫిక్‌ను 40 శాతం తగ్గించగలదని అంచనా. హైవేలు మరియు…