
గుంటూరులో డయేరియా వ్యాప్తి – అప్రమత్తమైన కార్పొరేషన్ అధికారులు, పానీపూరీ-టిఫిన్ బండ్లపై నిషేధం
గుంటూరు నగరంలో డయేరియా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో నగర పాలక సంస్థ (గుంటూరు కార్పొరేషన్) అత్యవసర చర్యలకు దిగింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా వ్యాధి వ్యాప్తికి కారణమని భావిస్తున్న కలుషిత ఆహారం, నీటి వనరులను నియంత్రించేందుకు పానీపూరీ అమ్మకాలు, టిఫిన్ బండ్లను తక్షణమే నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రగతి నగర్, రామిరెడ్డి తోట, రెడ్ల బజార్, సంగడిగుంటతో పాటు మొత్తం 9 ప్రాంతాల్లో…