 
        
            తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి ఎల్లుండి వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నెల 3వ తేదీ నుంచి 4వ తేదీ ఉదయం వరకు కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. కొమురంభీమ్…
