
రాజమౌళి పుట్టినరోజు సందడి – మహేశ్ బాబు ప్రత్యేక శుభాకాంక్షలు, అభిమానుల్లో ఉత్సాహం
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి నేడు తన 52వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. తెలుగు సినిమా గర్వకారణంగా, భారతీయ సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన దర్శకుడు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. స్టార్ హీరో మహేశ్ బాబు కూడా రాజమౌళికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. “ఒకే ఒక్కడు ఎస్.ఎస్. రాజమౌళి గారికి జన్మదిన శుభాకాంక్షలు! మీకు భవిష్యత్తులో అన్నీ ఉత్తమంగానే జరగాలని ఆశిస్తున్నాను. అద్భుతమైన పుట్టినరోజు జరుపుకోండి…