
గ్రూప్-1 నియామకాలపై కవిత ఫైరింగ్ – ప్రభుత్వ వైఫల్యాలపై వరుస నిరసనల ఎజెండా ప్రకటింపు
తెలంగాణలో గ్రూప్-1 నియామకాల వ్యవహారం మరోసారి రాజకీయ రంగు ఎక్కింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బరిలోకి దిగారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన గ్రూప్-1 అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. “గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల నుంచి ఫలితాలు వెలువడే వరకు ప్రతి దశలోనూ ప్రభుత్వం ఘోరమైన తప్పిదాలు చేసింది. ఈ వ్యవహారంలో పారదర్శకత…