
ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక దర్శనం
భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ విజయవాడ పర్యటనలో భాగంగా ఇంద్రకీలాద్రి కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఉప రాష్ట్రపతి దంపతులు ఆలయానికి చేరుకున్న వెంటనే రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, ఆలయ పాలకమండలి ఛైర్మన్ రాధాకృష్ణ, మరియు ఇతర అధికారులు వారిని సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శన ఏర్పాట్ల ద్వారా గర్భాలయంలో రాధాకృష్ణన్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు…