శాటిలైట్ వార్: అంతరిక్షం ఇప్పుడు యుద్ధ రంగమా? అమెరికా, చైనా, రష్యా మధ్య ఉద్రిక్తతలు, భారత్ పాత్ర ఏంటి?
2025 ఏప్రిల్‌లో అమెరికా, కొలరాడో స్ప్రింగ్స్‌లో జరిగిన అంతర్జాతీయ అంతరిక్ష భద్రతా సమావేశం, ప్రపంచాన్ని ఎంతో ఆలోచింపజేసింది. ఇందులో అమెరికా స్పేస్ కమాండ్ కమాండర్ జనరల్ స్టీఫెన్ వైట్నింగ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.“ఇప్పటివరకు ఏ యుద్ధం అంతరిక్షంలోకి వ్యాపించలేదు. కానీ ఇప్పుడు అంతరిక్షం కూడా యుద్ధ ప్రదేశంగా మారుతోంది” అని ఆయన చెప్పారు. అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలు ఇప్పటికే తమ ఉపగ్రహాలను రక్షించేందుకు, ఇతర దేశాల శాటిలైట్లను లక్ష్యంగా చేసేందుకు ప్రత్యేక ఆయుధాలపై…
