విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మదనాపురం గ్రామంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, శుభ్రతే ఆరోగ్యానికి మార్గమని పేర్కొన్నారు.
గ్రామస్తుల భాగస్వామ్యంతోనే పల్లెలను స్వచ్ఛంగా ఉంచడం సాధ్యమని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల చేత స్వచ్ఛత ప్రమాణం చేయించి, గ్రామ అభివృద్ధిలో అందరూ భాగస్వాములై ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. పరిశుభ్రత పాటించడం ద్వారా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చని మంత్రి వివరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు గ్రామాల్లో మురుగు కాల్వలు, చెత్తకుప్పలు లేకుండా చర్యలు తీసుకోవాలని, మొక్కలు నాటాలని ప్రజలను ప్రోత్సహించారు. గ్రామాల శుభ్రత కోసం ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సహాయపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కరనాయుడు, ఎంపీడీవో రమణమూర్తి, తహసిల్దార్ నీలకంటేశ్వరరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమని వారు స్పష్టం చేశారు.

 
				 
				
			 
				
			 
				
			