రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఆకస్మిక తనిఖీలు

District Superintendent Dr. Shiva Dayal conducted a surprise inspection at Ramayampet Community Health Center. He reviewed patient records, lab tests, and medical supplies, ensuring the hospital's functionality.

మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా సూపరిండెంట్ డాక్టర్ శివ దయాల్ ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా శివదయాల్ మాట్లాడుతూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఓపి వివరాలు ఐ పి వివరాలు ల్యాబ్లో ఎన్ని రక్త పరీక్షలు జరుగుతున్నాయి ఎన్ని పంపిస్తున్నారు అని వివరాలు అడిగి తెలుసుకున్నామని అన్నారు.అలాగే ఆసుపత్రిలో మందుల సరఫరా విషయంలో ఆయన పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రిలో పోస్టుమార్టం ఎన్ని అవుతున్నాయి.ఏ విధంగా చేస్తున్నారన్న వివరాలు అడిగి తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు.అదేవిధంగా ఆసుపత్రిలో డాక్టర్లు నర్సులు డ్యూటీలు ఎలా నిర్వహిస్తున్నారని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో జనవరి ఫిబ్రవరి నెల వరకు పూర్తిస్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేసే ప్రక్రియ చేపడతామని ఆయన తెలిపారు.ప్రజలకు అవసరమయ్యే వైద్యం అందించాలని ఆయన తెలియపరచారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డాక్టర్లు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *