ఆర్టిఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ అల్ ఇండియా కు మెయిన్ ఆర్గనైజర్ గా నేషనల్ బోర్డ్ కమిటీ ఆఫ్ ఇండియా సిఫార్సుపై తనను
నియమించినట్లు సన్ని కృష్ణ రాజయ్య బయగాని (ఆల్ఫా కృష్ణ ) తెలియజేశారు. విజెఎఫ్ ప్రెస్ క్లబ్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్టిఐ హ్యూమన్ రైట్స్ ఆక్టివిటీస్ అసోసియేషన్ నేషనల్ బోర్డు కమిటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ కామేష్ గాడి తనను జాతీయ స్థాయిలో మెయిన్ ఆర్గనైజర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు.
సమాజంలో అన్యాయం, అణచివేత, అవినీతి, సామాజిక, విద్యారంగాన్ని అధిగమించడం ద్వారా రాజ్యాంగం ద్వారా అందించబడిన హక్కులను సాధికారత, సాధికారత కల్పించే లక్ష్యంతో, మన ప్రజాస్వామ్య దేశం యొక్క స్థిరమైన అభివృద్ధి కోసం ఆర్టిఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ లక్ష్యాలు, విధానాలను అండర్టైన్ చేసే పని అప్పగించ బడిందన్నారు. ఈ పదవి మూడు సంవత్సరాలు పాటు ఉంటుందన్నారు. ప్రజలకు ఆర్టిఐ చట్టం, మానవ హక్కులను ప్రోత్సహించడం, ఆర్టిఐ హ్యూమన్ రైట్స్, యాక్టివిస్ట్ అసోసియేషన్ తరపున సంబంధిత సామాజిక కార్యకలాపాలను కొనసాగిస్తామని తెలిపారు.
