మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామంలో ఒక వ్యక్తి విద్యుత్ స్థంభానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన ప్రకారం, మిర్జాపల్లి గ్రామానికి చెందిన చింతల సిద్ధిరాములు, ఒక పెయింటర్‌గా పని చేస్తున్నాడు. గత రాత్రి అర్ధారాత్రి సమయంలో, ఇంటి పక్కన ఉన్న విద్యుత్ స్థంభానికి ఉరివేసుకుని ఆయన మరణించాడు.
స్థానికులు ఈ విషయం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు.
ఎస్ఐ నారాయణ గౌడ్ తెలిపిన ప్రకారం, మృతుడు తన కుటుంబ సభ్యులతో కొద్దిగా గొడవపడిన తరువాత ఇంటి నుండి వెళ్లిపోయాడు. తెల్లారి, ఇంటి ముందు ఉన్న విద్యుత్ స్థంభానికి ఉరివేసుకొని మరణించాడని ఆయన భార్య ఫిర్యాదు చేసింది.
పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణను కొనసాగిస్తున్నారు.
