రాష్ట్ర ప్రభుత్వం (ఈ.సి.సి.ఈ) ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కొత్త కరిక్యులంలో భాగంగా ఆటపాటల ద్వారా పిల్లలు విద్యను అభ్యసించి,అంగన్వాడీ కేంద్రాలు ఇక పూర్వ ప్రాథమిక విద్య కేంద్రాలుగా బలపరచడానికి అవసరమయ్యే ఫ్రీ స్కూల్ మెటీరియల్,కిట్స్ ని పంపిణీ చేసే కార్యక్రమంలో నిమగ్నం అయింది.అయితే ప్రైవేట్ కి ధీటుగా పూర్వ ప్రాథమిక పాఠశాలలో చదివే పిల్లలు విద్యను అభ్యసించడానికి కావలసినటువంటి సౌకౌర్య వంతమైన కిట్స్,మెటీరియల్ ఇప్పటికే సంబంధిత సి.డి.పి.ఓ ఆఫీస్ లకు చేరినట్టు సమాచారం.ఇప్పటికే జిల్లాలలోని సూపర్ వైజర్స్ పూర్వ ప్రాథమిక పాఠశాల విద్యకు సంబంధించి ఐదు రోజులు హైదరాబాదులో ట్రైనింగ్ కార్యక్రమం పూర్తిచేసుకోగా,సంబంధిత అంగన్వాడీ& పూర్వ ప్రాథమిక విద్య టీచర్స్ కి తాము నేర్చుకున్న నూతన కరిక్యూలం పై మూడు రోజులుసంబంధిత బుక్స్ మీద ట్రైనింగ్, అవగాహన కార్యక్రమాలు గావించారు. అయితే పిల్లలు ఈజీగా విద్యను అభ్యసించడానికి కావలసినటువంటి టిఎల్ఎమ్స్,బుక్స్ సైతం సెంటర్లలో అందుబాటులో చేరాయి.ప్లేయింగ్ గేమ్స్ కార్డ్స్, క్యాలెండర్స్,వర్క్ బుక్స్ వంటివి పిల్లలకు కృత్యాలు చేసి కృత్యాధార విద్యను అభ్యసించే విధంగా తోడ్పడుతున్నాయి.
ఆఫీసులకు చేరిన ప్రీ స్కూల్ మెటీరియల్స్…
అంగన్వాడీలకు ప్రీ ప్రైమరీ స్కూల్ జతచేయాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గొప్ప నిర్ణయానికి పునుకోగా,దాని ఆచరణ దిశగా మొదటి విడతలో భాగంగా ఇప్పటికే సంబంధిత సెంటర్లలో ఫ్రీ స్కూల్ మెటీరియల్స్ చేర్చారు. దీంట్లో భాగంగా పిల్లలకి స్టడీ టేబుల్స్,రౌండ్ టేబుల్స్,రెక్టాంగిల్ టేబుల్స్, మ్యాట్స్ ఇలా పలు రకాల వస్తువులు చేరాయి. భైంసా ప్రాజెక్టులో భాగంగా మొత్తం ఎనిమిది సెక్టార్ల కి గాను 205 అంగన్వాడి సెంటర్స్ వుండగా,మొదటి విడతలో భాగంగా దాదాపు 30 పూర్వ ప్రాథమిక కేంద్రాలకు సరిపడే వస్తువులు ఇక్కడికి చేరినట్లు సమాచారం. మిగతా సంబంధిత మెటీరియల్స్ తొందరలోనే రానున్నాయి.అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మెటీరియల్స్ పంపిణీకి సంబంధించి కార్యక్రమం అధికారికంగా నిర్వహించిన వెంబటే అన్ని పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలలో ఈ వస్తువులు చేరనున్నాయని సమాచారం.