నిర్మల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు 286 (PPC) సెంటర్లుగా నవంబర్ నెల నుంచే ఏర్పాటు చేయడం జరిగింది. సన్న రకం వరి ధాన్యానికి ప్రత్యేక సెంటర్లు మరియు దొడ్డు రకం వరి ధాన్యానికి వేరే సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో దాదాపు 33 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది.
ఇంతలో, ఎనిమిది కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రిలీజ్ చేయడం కూడా జరిగిందని అధికారులు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వాటిపై హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది.
ప్రతీ కేంద్రంలో స్పెషల్ ఆఫీసర్‌ను నియమించి, రైతులు నెగటివ్ రూమర్స్ నమ్మకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. ప్యాడి క్లీనర్ల సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం ద్వారా రైతుల అనుకూలంగా ఉండేలా చూడబడింది.
ఈ కొనుగోలు డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగుతుందని, ఇంకా ఒక లక్ష 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.
