అంతర్వేదిలో శ్రీ నారసింహ సుదర్శన హోమం

In Antervedi, Dr. B.R. Ambedkar Konaseema District, the Sri Narasimha Sudarshana Homa was conducted at the Sri Lakshmi Narasimha Swamy Temple. In Antervedi, Dr. B.R. Ambedkar Konaseema District, the Sri Narasimha Sudarshana Homa was conducted at the Sri Lakshmi Narasimha Swamy Temple.

డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, అంతర్వేది గ్రామంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నందు నిర్వహించు శ్రీ నారసింహ సుదర్శన హోమమునకు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ వాస్తవ్యులు పుల్లెపు త్రిమూర్తులు వారి కుటుంబ సభ్యులు ఒక సంవత్సరం సుదర్శన హోమంనకు రూ 40,000 లు, 6 నెలలకు శ్రీ స్వామివారి అభిషేకమునకు రూ 10,000 లు వెరశి మొత్తం 50,000 వేల రూ.లు విరాళంగా సమర్పించినారు. వీరికి శ్రీ స్వామి వారి ప్రత్యేక దర్శనం అనంతరం శ్రీ స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేసినారు. ఈ కార్యక్రమంలో ఆలయ పరివేక్షకుల విజయ సారధి, కిరణ్, సేవకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *