బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు సంబంధించిన సంచలన విషయాలను అతని మాజీ గాళ్‌ఫ్రెండ్ సోమీ అలీ వెల్లడించింది. 1990లలో సల్మాన్‌తో చెట్టపట్టాలేసుకుని తిరిగిన ఆమెకు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి ఒక కాల్ వచ్చిందని ఆమె గుర్తుచేసుకుంది. ఆ కాల్‌ను స్వయంగా ఆమెనే లిఫ్ట్ చేసిందని తెలిపింది. ఈ సందర్భంలో, ఆమె దావూద్ గురించి చాలా విన్నట్లు పేర్కొంది, అయితే అండర్ వరల్డ్ గురించి ఎక్కువగా మాట్లాడేవారు కాదని, దావూద్ లేదా చోటా షకీల్ పేరు ప్రస్తావించడం ఒక సంప్రదాయంగా లేదు అని వివరించింది.
సోమీ తన దగ్గర కొంత సమయం గడిపిన ప్రముఖ నటి దివ్య భారతి గురించి కూడా మాట్లాడింది. బెంగళూరులో ‘ఆందోళన్’ సినిమా షూటింగ్ సమయంలో ఆమెకు దివ్య చాలా సన్నిహితంగా ఉన్నట్లు గుర్తుచేసుకుంది. దివ్య భారతి తనకు అండర్ వరల్డ్ గురించి వివరిస్తూ, “మాఫియా అంటే ఏంటో నీకు తెలుసా?” అని అడిగిందని చెప్పారు. దానికి సోమీ “అమెరికాలో ఇటాలియన్ మాఫియా ఉంటుంది” అని సమాధానం ఇచ్చింది, ఆ సందర్భంలో అండర్ వరల్డ్ మాఫియా రెండూ ఒకటేనని దివ్య పేర్కొంది.
సోమీ అలీ సల్మాన్‌ఖాన్‌తో గడిపిన మూడు సంవత్సరాల గురించి చెప్పారు. ఒకసారి, గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో ఉన్న సమయంలో, తమ బెడ్రూంలో ల్యాండ్‌లైన్‌కు వచ్చిన ఫోన్ ద్వారా తనను కిడ్నాప్ చేస్తామని బెదిరించినట్లు వివరించింది. “సల్మాన్ కో ఫోన్ దేనా, సోమీ అలీ కో హమ్ ఉఠా కర్ లే జాయేంగే” అని చెప్పారు. ఈ విషయం ఆమె సల్మాన్‌కు చెప్పగా, ఆయన చూసుకుంటానని చెప్పారని, కానీ ఆ విషయాన్ని ఎలా డీల్ చేశాడన్నది ఆమెకు తెలియకపోయిందని తెలిపింది.