ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్ సమస్య పెరుగుతోంది. ఇది గుండెజబ్బులు, మధుమేహానికి దారితీస్తోంది. వైద్య నిపుణుల ప్రకారం, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నప్పుడు శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా చర్మంపై కనిపించే లక్షణాలను ముందుగానే గుర్తిస్తే, ఈ సమస్యను సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు.
అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో కాళ్ల చర్మం రంగు మారడం సాధారణంగా కనిపిస్తుంది. కాళ్ల దిగువ భాగంలో చర్మం తెల్లగా మెరుస్తూ కనిపించడం, లేదా ఎరుపు రంగు మచ్చల్లా ఉండటం కొలెస్ట్రాల్ పేరుకుపోయిందనే సంకేతం. అలాగే, మోచేతులు, మోకాళ్లు, చేతులపై చిన్నపాటి బొడిపెలు ఏర్పడటం కూడా అధిక కొలెస్ట్రాల్ లక్షణంగా చెప్పొచ్చు.
కళ్ల చుట్టూ, కనురెప్పల వద్ద పసుపు రంగు చారలు కనిపించడం ఒక ముఖ్యమైన లక్షణం. దీనిని ‘జ్సాంతెలెస్మా’గా పిలుస్తారు. చర్మంపై మెత్తగా, జిగురుగా ఉండే ప్రాంతాలు కనిపించడం కూడా కొలెస్ట్రాల్ పెరిగినట్లు సూచిస్తుంది. వీటిని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా భవిష్యత్ ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు.
అలాగే, గాయాలు మానడంలో ఆలస్యం కావడం, చర్మంపై నలుపు రంగు ప్యాచ్‌లు ఏర్పడటం కూడా అధిక కొలెస్ట్రాల్ లక్షణాలుగా పరిగణించవచ్చు. అయితే, ఈ లక్షణాలు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా రావొచ్చు. అందుకే, ఏవైనా మార్పులు గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది.