పువ్వులను పూజించడం తెలంగాణ సంస్కృతి అని ప్రకృతికే అందం మన బతుకమ్మ పండగ అని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. భరోసా కార్యాలయ ప్రాంగణంలో జిల్లా పోలీస్ సిబ్బందితో కలిసి బతుకమ్మ పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ సంస్కృతికి చారిత్రాత్మక చిహ్నం బతుకమ్మ పండుగని, సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని, పోలీసు కుటుంబ సభ్యులతో బతుకమ్మ ఆడడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అవినాష్ కుమార్ ఐపిఎస్ , జిల్లా ట్రెజరీ అధికారి సరోజిని, డిఎస్పి గంగారెడ్డి, ఇన్స్పెక్టర్లు, ఆర్ ఐ లు, ఎస్సైలు వారి కుటుంబ సభ్యులు మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగ యొక్క ప్రాముఖ్యత
