సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పుష్ప-2 బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, కలెక్షన్ల సునామీ సృష్టించింది. పాట్నాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు 3 లక్షల మందికి పైగా హాజరై చర్చనీయాంశంగా మారింది.
అయితే, పాట్నాలో జరిగిన ఈవెంట్‌పై హీరో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తన కొత్త సినిమా ‘మిస్ యూ’ ప్రమోషన్ కార్యక్రమంలో, బీహార్‌లో ఇంత క్రౌడ్ రావడం ప్రత్యేకమైన విషయం కాదని అన్నారు. రోడ్డుపై కూడా ఎక్కువ మంది గుమికూడతారంటూ, ఈవెంట్‌ను చిన్నచూపు చూడటానికి ప్రయత్నించారు.
సిద్ధార్థ్ వ్యాఖ్యలు బన్నీ అభిమానుల కోపానికి గురయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో ఆయనపై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి. ఇలాంటి వ్యాఖ్యల వల్లే సిద్ధార్థ్ కేరియర్ దిగజారిందని కొందరు వ్యాఖ్యానించారు. పుష్ప-2 ఈవెంట్‌ను విమర్శించడం కంటే, తన సినిమాలపై దృష్టి పెట్టాలనే సూచనలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ నెల 13న సిద్ధార్థ్ నటించిన ‘మిస్ యూ’ విడుదల కానుంది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, సినిమా విడుదలకు ముందు ఆయన పట్ల అభిమానులు, ప్రేక్షకుల్లో ప్రతికూలత పెరిగే అవకాశం ఉందని సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది.