వైజాగ్ స్టీల్ కోసం షర్మిల కేంద్రంపై ఫైర్

AP Congress Chief Sharmila questions Centre’s bias on steel plants, demands justice for Vizag Steel and calls for TDP, Jana Sena to leave NDA. AP Congress Chief Sharmila questions Centre’s bias on steel plants, demands justice for Vizag Steel and calls for TDP, Jana Sena to leave NDA.

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటక స్టీల్ ప్లాంట్‌కు భారీ నిధులు కేటాయించిన కేంద్రం, 26 వేల మంది పనిచేసే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ఆదుకోవడంలో విఫలమైందని మండిపడ్డారు. జేడీఎస్ పార్టీ కేవలం 243 మంది ఉద్యోగులు ఉన్న ప్లాంట్‌కు రూ. 15 వేల కోట్లు తెచ్చుకుందన్నారు.

షర్మిల టీడీపీ, జనసేనలను లక్ష్యంగా చేసుకున్నారు. కేంద్ర ఎన్డీయే ప్రభుత్వానికి అండగా ఉన్న టీడీపీ, జనసేనలు తమ రాష్ట్ర హక్కులను నిలబెట్టడంలో విఫలమయ్యాయని విమర్శించారు. కార్మికులు 1,400 రోజులుగా పోరాడుతుంటే, సీఎం చంద్రబాబు ప్రధానితో మిట్టల్ స్టీల్ గురించి చర్చించడం అవమానకరమని అన్నారు.

మిట్టల్ పెట్టబోయే ప్లాంట్‌కు ఇనుప ఖనిజం కొరత లేకుండా చూడాలని కేంద్రం దృష్టిని ఆకర్షించడం అన్యాయం అని ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్మికుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తుందని షర్మిల తెలిపారు.

ప్లాంట్‌కు న్యాయం జరిగే వరకు ఎన్డీయేలో ఉండటం సిగ్గుచేటని చెప్పారు. టీడీపీ, జనసేన వెంటనే ఎన్డీయే నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. అలా జరిగితేనే ప్లాంట్‌కు న్యాయం జరుగుతుందని ఆమె నొక్కి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *