ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న శ్రీనివాసులు అనే ఉపాధ్యాయుడు రోజూ మద్యం సేవించి పాఠశాలలో విధులు నిర్వర్తిస్తూ విద్యార్థులపై దాడి చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి రాజేంద్ర కుమార్ సార్ గారికి ఈ విషయంపై వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ, పాఠశాలలో విద్యార్థులపై దాడులు చేయడం వల్ల విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని, ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి గౌస్, నాయకులు శశిధర్, నాగరాజు, రవితేజ, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. వారు, అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
