సందీప్ రెడ్డి, ధోనీ కాంబో అదుర్స్.. యాడ్ ప్రోమో వైరల్!

A new ad promo featuring MS Dhoni, directed by Sandeep Reddy Vanga, is going viral. Dhoni’s 'Animal' style entry is grabbing attention. A new ad promo featuring MS Dhoni, directed by Sandeep Reddy Vanga, is going viral. Dhoni’s 'Animal' style entry is grabbing attention.

‘యానిమల్’ సినిమాతో సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా డైరెక్టర్‌గా ఎదిగారు. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ మూవీ భారీ విజయం సాధించి సందీప్ క్రేజ్‌ను మరింత పెంచింది. ఇప్పుడు ఆయన ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమాకు దర్శకత్వం వహించనున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఓ యాడ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఈ యాడ్‌లో ప్రధాన పాత్రలో నటించగా, ఇది ఓ ఎలక్ట్రిక్ సైకిల్ బ్రాండ్ ప్రకటనగా రూపొందించబడింది. వీడియోలో ధోనీ, ‘యానిమల్’ సినిమాలో రణబీర్ క్యారెక్టర్‌లా స్టైల్‌గా సైకిల్‌పై ఎంట్రీ ఇవ్వడం విశేషం.

ప్రస్తుతం ఈ యాడ్‌కు సంబంధించిన ప్రోమోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సందీప్ రెడ్డి మార్క్ టేకింగ్, ధోనీ యాటిట్యూడ్‌ దీనికి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. అభిమానులు ఈ యాడ్ పూర్తిగా విడుదల కావాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి రూపొందించిన ఈ యాడ్ అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. ఎంఎస్ ధోనీ, సందీప్ రెడ్డి కాంబినేషన్‌లో మరిన్ని ప్రాజెక్టులు రానున్నాయా? అన్న ఉత్సుకత అభిమానుల్లో నెలకొంది. ఇక పూర్తి యాడ్ విడుదలైతే మరోసారి సంచలనం సృష్టించనుందని చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *