భగత్ సింగ్ నగర్ లో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు

Bathukamma celebrations, led by Gaddam Sridevi, took place at Bhagat Singh Nagar, featuring traditional dances and prayers around floral arrangements.

గడ్డం శ్రీదేవి ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబురాలు ఈ వేడుకలలో తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో భగత్ సింగ్ నగర్ కట్ట మీద ఎల్లమ్మ గుడి ప్రాంగణంలో స్థానిక మ‌హిళ‌ల‌తో కలిసి బ‌తుక‌మ్మ‌ల‌కు పూజ‌లు నిర్వ‌హించి వేడుకలు ప్రారంభించారు.బతుకమ్మల చుట్టూ బతుకమ్మ పాటలకు కోలాటం చేస్తూ ఉత్స‌హాంగా నృత్యాలతో సందడి చేశారు. ఈ వేడుక‌ల‌లో పాల్గొన్న మ‌హిళల‌కు పులిహోర ప్ర‌సాదాలు చల్లటి పనియాలు ,మంచినీరు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా గడ్డం శ్రీదేవి మాట్లాడుతూ తెలంగాణ‌లో బతుక‌మ్మ‌కు ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంద‌ని, ఆడ‌ప‌డుచుల‌కు ఎంతో పీతిపాత్ర‌మైన పండుగ‌ని పేర్కొన్నారు. ఎల్లమ్మ గుడి ప్రాంగ‌ణంలో ఏడు రోజులపాటు బతుకమ్మ ఉత్సవాలను ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవ‌డం సంతోష‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా భగత్ సింగ్ నగర్ కాలనీ వాసులకు, ఆడపడుచులందరికి స‌ద్దుల‌ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, అంతా మంచే జ‌రుగాల‌ని ఆమే అకాంక్షించారు.

ఈ వేడుకల్లో సత్యమ్మ,యాదమ్మ,స్వరూప,దివ్య,సంధ్య రాణి,సంధ్య, అరుణ, సుగుణ,నాగరాణి, స్వాతి, ఉమా విజయ,శాంతమ్మ, గీత,విమల,వాణి,సంధ్య,వైష్ణవి, మేఘన, చుక్రు,అఖిల, పొట్టి, గనిష్క, లక్కీ,చిన్నారుల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *