- మద్యం టెండర్లపై మంత్రి నారాయణ మీద వచ్చిన కథనాలు అవాస్తవం
- సాక్షి మీడియాలో మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శలు అవాస్తవం
- మద్యం టెండర్లు ఎవరికైతే వస్తాయో వారికే మద్యం దుకాణాలు అని మంత్రి నారాయణ కరాఖండిగా చెప్పేశారు.
- ఇందుకు సాక్ష్యం నేనేనని ఆరోజు మంత్రితో నేనున్నానని అన్నారు.
ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతు నెల్లూరు నగరంలో ప్రభుత్వ మద్యం షాపులకు సంబంధించినటువంటి టెండర్లలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నగరంలో సిండికేట్లను తయారుచేసి తన అనుచరులకు తన కార్యకర్తలకు ఇస్తున్నారని సాక్షి మీడియాలో మరియు నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడిన విషయాలు పచ్చి అబద్ధమని చెప్పారు. ఈ విషయానికి సంబంధించి మీడియా మిత్రులకు మరియు జిల్లా ప్రజానీకానికి వాస్తవాలు తెలియజేస్తున్నానన్నారు. ప్రభుత్వం మద్యం టెండర్లు ఆహ్వానించిన అనేకమంది మద్యం షాపుల కోసం టెండర్లు వేస్తున్న సమయంలో కొంతమంది నాయకులు, కార్యకర్తలు మంత్రి నారాయణ దగ్గరికి వచ్చింది వాస్తవమే అన్నారు, అప్పుడు మంత్రి నారాయణ సమక్షంలో నేను కూడా ఉన్నానన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, నాయకులు, కార్యకర్తలు కొంతమంది మంత్రి దగ్గరకు వచ్చి మద్యం షాపుల్లో మాకు భాగాలు ఇప్పించండి అని చెప్పింది వాస్తవమే. స్వయంగా మంత్రి నారాయణ ఒకటే మాట చెప్పారు నేను అలాంటి పనులు చేయనని తెగేసి చెప్పానన్నారు. నాకు అలాంటి అలవాట్లు లేవన్నారు. ఒక్క మద్యం దుకాణాల్లోనే కాదు నెల్లూరు నగరంలో పరిధిలో ఏ ఒక్క వ్యాపారస్తుల్ని పిలిచి మాతో తిరిగే నాయకులకు గాని కార్యకర్తలు గాని భాగాలు ఇవ్వమని నేను చెప్పనని నిర్మొహమాటంగా చెప్పారు. ఇదే విషయాన్ని అనేకమార్లు టెలికాన్ఫరెన్స్ లో కూడా మంత్రి నారాయణ చెప్పడం జరిగిందన్నారు. అంతేకాకుండా పోలింగ్ అయినా పక్క రోజే మంత్రి నారాయణ తన కుటుంబ సంపాదనలో నాకోసం నా కుటుంబం కోసం కష్టపడిన నాయకులకు కార్యకర్తలకు ప్రతి సంవత్సరం 10కోట్ల రూపాయలు వెచ్చిస్తానని హామీ ఇచ్చిన గోప్ప నాయకుడు నారాయణ అని అన్నారు. స్వయంగా మంత్రి నారాయణ నాయకులు కార్యకర్తలతో మాట్లాడి మీరు పోయి అప్లికేషన్లు వేసుకొని టెండర్లలో షాపులు వస్తే వ్యాపారం చేసుకోండని అన్నారు. ఒకవేళ టెండర్లు రాకపోతే వ్యాపారస్తుల్ని భయభ్రాంతులకు గురి చేయొద్దని కరాకండిగా తేల్చి చెప్పారన్నారు. మంత్రి నారాయణ నాకు అనేక సందర్భాల్లో రూప్ నువ్వేమన్నా పొరపాటు చేస్తావేమో ఎవరినైనా బెదిరిస్తావేమో గతంలో నువ్వు ఈ విధంగా చేస్తావని నేను అనేక దగ్గర్ల విన్న, నా దగ్గర నీ గురించి చాలామంది నాకు చెప్పారు. కానీ నా దగ్గర అలాంటివి కుదరవని నారాయణ గారు స్వయంగా నిర్మొహమాటం లేకుండా నాకే చెప్పారన్నారు. నారాయణ గారి టెలికాన్ఫరెన్స్లో 3000 మంది నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటారని చెప్పారే తప్ప మద్యం దుకాణాలు వారికి ఇస్తానని నారాయణ గారు చెప్పలేదన్నారు. ఇప్పటికీ మద్యం దుకాణాల టెండర్ల విషయంలో 400 వందల అప్లికేషన్లు వచ్చాయని అన్నారు. ఇది ఏ విధంగా సిండికేట్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు అన్నారు. నారాయణ మంత్రి అయిన ఈ నాలుగు నెలల్లో కార్యకర్తల కోసం అనేక కార్యక్రమాలు చేశారన్నారు. తన కుటుంబ సంపదలో నుంచి కార్యకర్తలకు అనేక సందర్భాల్లో సహాయ సహకారాలు అందించారన్నారు. మంత్రి నారాయణ దృష్టిలో రూప్ కుమార్ యాదవ్ అయినా స్థానిక కార్పొరేటర్లైన నాయకులైన అందరూ ఒక్కటేనని అన్నారు. నారాయణ గారి కోసం శక్తి వంచన లేకుండా పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి కచ్చితంగా ఆయన సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. మంత్రి నారాయణ ఎక్కడ కూడా అక్రమాలకు తావు లేకుండా పనిచేస్తున్నారని అన్నారు. మీడియా మిత్రుల సమక్షంలో ఈ నెల్లూరు జిల్లా ప్రజానీకానికి ప్రభుత్వపరంగా అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కాకుండా మంత్రి నారాయణ వ్యక్తిగతంగా ఆయన కుటుంబ సంపాదనలో భాగంగా ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయలు నాయకులు కార్యకర్తలు సంక్షేమం కోసం ఉపయోగిస్తానని అన్నారు. మంత్రి నారాయణ ఒక మాట చెప్తే ఏ విధంగా చేస్తారో నాకే కాదు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ తెలుసు అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దార్ల వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు దేవరకొండ సుజాత అశోక్, అస్మా మైనుద్దీన్, గోగుల నాగరాజు, నాయకులు నిశ్చల్ కుమార్ రెడ్డి, అల్లంపాటి జనార్దన్ రెడ్డి, ఊటుకూరు చంద్ర తదితరులు పాల్గొన్నారు.

 
				 
				
			 
				
			 
				
			