ఏలూరు జిల్లా చింతలపూడి చింతలపూడి నియోజకవర్గంలోని లింగపాలెం మండలంలో ఆరుకోట్ల 30 లక్షల రూపాయల నిధులతో పల్లె పండుగ కార్యక్రమంలో అయ్యప్పరాజు గూడెం కలరాయి గూడెం, ములగ లంకపాడు, బోగోలు, రంగాపురం గ్రామాలలో సిసి రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ . బుధవారం పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం హయాంలో అంతర్గత రహదారులు సైతం పట్టించుకున్న పాపాన పోలేదని రోడ్లన్నీ గుంతల మయంగా తయారై ప్రమాదాల బారిన పడుతున్న పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం లో పల్లె పండుగ ద్వారా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నజీమ్ మునిషా, ఎంపీడీవో వాణి, లింగపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చలపతిరావు, కూటమి నాయకులు మాజీ సర్పంచ్ చలమాల నాగేశ్వరరావు మహిళా నాయకురాలు సుగుణ కుమారి పలగాని రామకృష్ణ ఆచంట శ్రీనివాసరావు మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు మొనగాల చిన్నులు పాల్గొన్నారు.
పల్లె పండుగ కార్యక్రమంలో రోషన్ కుమార్ శంకుస్థాపన
 In Chintalapudi, MLA Rohan Kumar initiated CC road construction in five villages, emphasizing government efforts for rural development during the Palle Panduga event.
				In Chintalapudi, MLA Rohan Kumar initiated CC road construction in five villages, emphasizing government efforts for rural development during the Palle Panduga event.
			
 
				
			 
				
			 
				
			