కామారెడ్డి జిల్లా బాన్సువాడ లో వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి , ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.500 బొనస్ వచ్చిన రైతులు వీరికి శాలువా కప్పి స్వీట్ తినిపించారు.నిజామాబాద్ ఉభయ జిల్లాలోని కలెక్టర్లతో రైస్ మిల్లర్ల యజమానులతో మాట్లాడి వరి ధాన్యం కొనుగోలను వేగవంతం అయ్యేటట్టు చేశామని అన్నారు.ధాన్యం కొనుగోలు చేయడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఆరోపనలను ఖండించారు.బాన్సువాడ నియోజకవర్గంలో గతంలో కంటే 10 టన్నులు వారి ధాన్యం అధికంగా కొనుగోలు చేశామని అన్నారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం ఇచ్చిoదన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం పార్టీ కార్యాలయం ఆవరణలో రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు రైతులు నాయకులు పాలాభిషేకం చేశారు.
బాన్సువాడలో వరి ధాన్యం కొనుగోలు పై సమీక్ష
