రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్. పాంగూరు. నారాయణ గారు వీధి వ్యాపారుల ఆర్థిక అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని “స్మార్ట్ స్ట్రీట్ బజార్” ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ ఆదేశించారు.
ప్రాజెక్టు అమలు కోసం శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో కమిషనర్ సూర్య తేజ విద్యుత్ శాఖ, పోలీసు విభాగం, మరియు ఇతర సంబంధిత శాఖలను కలిసి సమగ్రంగా చర్చించారు. వారు విద్యుత్ శాఖ అధికారులకు అవసరమైన పనులను పూర్తి చేయాలని సూచించారు.
పోలీసు విభాగం దుర్వినియోగం నివారణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అలాగే వ్యాపారులు తమ వస్తువులను కాపాడుకోవడానికి కంటైనర్లు పర్యవేక్షించబడాలని ఆదేశించారు. ఇక ఇంజనీరింగ్, విద్యుత్ శాఖలకు సంయుక్త తనిఖీల ద్వారా టైం లైన్ ప్రిపేర్ చేయాలని కూడా కమిషనర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రామ్మోహన్ రావు, ఈ.ఈ రహంతు జానీ, డి.ఈ రఘురాం, విద్యుత్ శాఖ ఈ.ఈ, డి.ఈ లు, పోలీసు విభాగం, మెప్మా విభాగం, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

 
				 
				
			 
				
			 
				
			