రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల తో కలిసి అట్రాసిటీ కేసులు వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అలాగే జిల్లాలో వివిధ శాఖల ద్వారా ఎస్సీ ఎస్టీలకు అందుతున్న అభివృద్ధి ఫలాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని సూచించారు. ఇప్పటివరకు నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అట్రాసిటీ కేసుల బాధితులకు పోలీసులు అండగా నిలవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ ఎస్టీలు అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వివిధ శాఖల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో పాఠశాల విద్యను ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషిచేసిన విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డిని కమిషన్ చైర్మన్ సభ్యులు సన్మానించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు పైజన్ అహ్మద్, కిషోర్ కుమార్లు ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు ప్రవీణ్, రాంబాబు, నాయక్ శంకర్,
లక్ష్మి నారాయణ, నీలాదేవి, షెడ్యూల్ కులాల అధికారి రాజేశ్వర్గౌడ్ ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అట్రాసిటీ కేసులపై సమీక్షా సమావేశం
