జ్వల భవిష్యత్తు కలిగిన యువత మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వై. వి. గణేష్ అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మిని కాన్ఫరెన్స్ హాలు లో యువత మత్తు పదార్థాల నియంత్రణపై హనుమకొండ జిల్లా డి.ఆర్.ఓ వై.వీ గణేష్, సెంట్రల్ జోన్ డిసిపి సలీమా, ఇతర శాఖల అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా శాఖల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నియంత్రణ కు తీసుకుంటున్న చర్యలపై అధికారులు వివరించారు.
అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి వై. వి. గణేష్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడంలో తమ కుటుంబీకుల బాధ్యత కీలకం అని అన్నారు. తమ పిల్లల ఆహారపు అలవాట్లపై ప్రతి రోజు నిఘా ఉండాలన్నారు. ఎదిగే టీనేజ్ పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రత్యేక శ్రద్ధ అవసరం అని అన్నారు. చదువు చెప్పే టీచర్ తమ విద్యార్థి యెక్క ఆలోచన విధానాలు , వారి వ్యవహార శైలి , అలవాట్ల పై ప్రత్యేక శ్రద్ధ అవసరం అన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు అయిన విద్యార్ధిని దగ్గరలో ఉన్న అధికారుల దృష్టి కి తీసుకొని వెళ్ళి వారిని రి-హాబిలిటేషన్ సెంటర్లకు తీసుకెళ్ళి చికిత్స అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి పాఠశాల, కళాశాల పరిసర ప్రాంతాలలో ఉన్న పాన్ షాప్లు , చిన్న చిన్న సిగరెట్ విక్రయ దుకాణాల పట్ల నిరంతర నిఘా ఉండేలా చూసుకోవాలని అన్నారు. మత్తు పదార్థాల అరికట్టడం లో పోలీసులదే ముఖ్య పాత్ర అన్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కమర్షియల్, అనుమానాస్పదంగా ఉన్న ప్రతి ఒక్క వాహనాలను తనిఖీ చేయాలన్నారు. పోలీసులు ముఖ్యంగా పాఠశాల , జూనియర్ కళాశాల ఆవరణ లో ఉన్న అన్ని దుకాణాల పట్ల నిరంతర నిఘా, ఎప్పటికప్పుడు ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాల , జూనియర్ కళాశాల యాజమాన్యంతో మాట్లాడి అవగాహన సదస్సు కల్పించాలని కోరారు. మత్తు రహిత సమాజం నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రతి పాఠశాల కళాశాలలో ప్రహరీ క్లబ్ ల నిర్మాణం జరగాలని అని, వాటి ద్వారా మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ అదనపు డి.సి. పి సలీమా మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనాలను తనిఖీ చేసే కార్యక్రమం ముమ్మరం చేసి , ప్రభుత్వ , ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాలలు , జూనియర్ కళాశాలల చుట్టు పక్కల అవరణాలల్లో ఉన్న ఏ ఒక్క పాన్ షాపు , సిగరెట్ విక్రయ దుకాణాల ఉండకుండా చూడాలని పోలీసు అధికారులు ఆదేశించారు. రద్దీగా , కూడలిలో ఉన్న ప్రతి ఒక్క పాన్ షాపు, సిగరెట్ విక్రయ దుకాణాల పట్ల ప్రత్యేక నిఘా అవసరం అని అన్నారు. అనుమానాస్పదంగా తిరిగే వాహనాలు కనిపిస్తే వెంటనే డయల్ 100 , టోల్ ఫ్రీ 1908 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు కోరారు.
ఈ కార్యక్రమంలో పరకాల ఆర్ఢీవో నారాయణ, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఏ.సి.పిలు, నార్కోటిక్స్ , పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి హనుమకొండ వారిచే జారీ చేయనైనది.
