తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ యాత్రను ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని సంగెం గ్రామం నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. యాత్ర ప్రారంభానికి ముందు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మూసీ నదిలోని నీటిని పరిశీలించారు. ఓ బాటిల్‌తో మూసీ నీటిని ఒడిసి పట్టుకుని, నదిని పునరుద్ధరించేందుకు తాము తీసుకొనే చర్యలపై దృష్టి సారించారు.
ఈ యాత్రకు కాంగ్రెస్ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సంగెం నుండి భీమలింగం వరకు రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుందనేది యాత్ర యొక్క ముఖ్యాంశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాత్ర ప్రారంభించే ముందే, సంగెం వద్ద ప్రసిద్ధ శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ యాత్ర దాదాపు 2.5 కిలోమీటర్ల మేర సాగుతుంది.
మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమం ద్వారా స్థానిక రైతులకు, ప్రజలందరికి పెద్ద రక్షణ కల్పించే అవకాశం ఉంది.
