బొబ్బిలి మండలం, పారాది గ్రామం వద్ద వేగావతి నదిపై వంతెన నిర్మాణానికి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు(బేబీ నాయన) చేతులమీదుగా పనులు పునఃప్రారంభించారు.
గౌరవ మాజీ మంత్రి శ్రీ సుజయ్ కృష్ణ రంగారావు గతంలో మంజూరు చేయించిన నిధులకు అదనంగా 6%జీఎస్టీ మరియు డైవర్షన్ రోడ్డు కి కలిపి ఇప్పుడు రూ13,40,00,000/- తో నిర్మాణం ప్రారంభించారు..రెండు రాష్ట్రాల రహదారులకు ప్రధాన మార్గం అయిన ఈ వంతెన యొక్క సమస్య తీవ్రతను ఎమ్మెల్యే బేబీనాయన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి వివరించి, త్వరితగతిన నిధులు మంజూరు అయ్యేలా సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన మాట్లాడుతూ,ఈ వంతెన పునఃనిర్మాణ పనులు తన హయాములో జరగడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు..అలాగే, వంతెన నిర్మాణం వచ్చే ఏడాది వర్షాకాలంలోపు పూర్తిచేసే విధంగా చూడాలని ఎమ్మెల్యే బేబీనాయన అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అల్లాడ భాస్కరరావు, రొంపిల్లి గ్రామ సర్పంచ్ బవిరెడ్డి శంకర్రావు గారు, పారాది గ్రామ పెద్దలు, ప్రజలు మరియు ఆర్ & బి అధికారులు పాల్గొన్నారు.