పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబోలో సినిమా రాబోతుందనే ప్రకటన గతంలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రాజెక్ట్ తర్వాతి క్రమంలో పట్టాలెక్కకపోవడంతో పలు పుకార్లు పుట్టుకొచ్చాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా ఆగిపోయిందంటూ ఊహాగానాలు వినిపించాయి. తాజాగా, ఈ సినిమా నిర్మాత రామ్ తాళ్లూరి ఈ విషయంపై స్పందించారు.
రామ్ తాళ్లూరి చెప్పిన వివరాల ప్రకారం, సురేందర్ రెడ్డి పవన్ కోసం రేసుగుర్రం, కిక్ తరహాలో మంచి కమర్షియల్ కథను సిద్ధం చేశారట. స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది. ఇది చాలా కాలంగా సెట్స్ మీదకు రావాల్సి ఉండగా, పవన్ కళ్యాణ్ రాజకీయాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. అంతేకాకుండా, సురేందర్ రెడ్డి అఖిల్‌తో ఏజెంట్ మూవీని తెరకెక్కించడంతో మరింత ఆలస్యం జరిగింది.
ఇప్పుడు పవన్ ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడమే పెద్ద పని అయింది. రామ్ తాళ్లూరి ప్రకారం, పవన్ తన ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాతే ఈ సినిమా గురించి ఆలోచించవచ్చు. మరోవైపు, సురేందర్ రెడ్డి మరో కథను సిద్ధం చేసి త్వరలోనే మరో పెద్ద హీరోకు వినిపించనున్నట్లు రామ్ తాళ్లూరి వెల్లడించారు.
